SKLM: ఇచ్చాపురం రైల్వే స్టేషన్లో గురువారం పోలీసులు జరిపిన తనిఖీలలో గంజాయి పట్టుబడింది. ఈ ఘటనలో తమిళనాడుకి చెందిన ఐదుగురిని అదుపులోకి తీసుకున్నారు. వీరిలో నలుగురు స్త్రీలు ఒక పురుషుడు ఉన్నారు. వారి వద్ద నుంచి 32 కిలోల గంజాయి, 5 మొబైల్స్‌ని స్వాధీనం చేసుకున్నామని CI చిన్నమనాయుడు తెలిపారు. అనంతరం మేజిస్ట్రేట్ ముందు హాజరు పరిచి రిమాండ్‌కి తరలించారు.