»Youth Shot For Ringing Doorbell By Mistake Kansas City Usa
Door Bell: డోర్బెల్ తప్పుగా మోగించాడని యువకుడిపై కాల్పులు
పక్కింటికి వెళ్లాల్సిన ఓ వ్యక్తి(Black teenager)..తన ఇంటికి వచ్చి డోర్ బెల్ కొట్టాడని ఓ ఇంటి యజమాని ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతటితో ఆగలేదు. ఆ యువకుడిపై రెండు రౌండ్ల కాల్పులు(gun shooting) జరిపాడు. ఈ ఘటన ఇటీవల అగ్రరాజ్యం అమెరికా(USA Kansas City)లో జరిగింది. దీనిపై అమెరికా అధ్యక్షుడు సైతం స్పందించారు.
ఏవరైనా తెలియని వారు అనుకోకుండా మన డోర్ బెల్(door bell) మోగిస్తే ఏం చేస్తాం. సాధారణంగా అయితే కోపంతో రెండు మూడు మాటలు అన్న సందర్భాలు విన్నాం. అయితే వారు రావాల్సింది మన ఇంటికి కాదు పక్కింటికి అని తెలిస్తే.. ఇంకా విసుగు చెందడమో లేదా అతనిపై జాలీ పడటమో చేస్తాం. అయితే అచ్చం ఇలాంటి ఘటన ఇటీవల అమెరికా(america)లో జరుగగా ఓ వ్యక్తి మాత్రం ఏకంగా డోర్ బెల్ తప్పుగా కొట్టిన వ్యక్తిని తుపాకీతో కాల్చేశాడు(gun shooting).
ఇక వివరాల్లోకి వెళితే అమెరికాలోని కాన్సాస్ సిటీ(USA Kansas City)లో తన డోర్బెల్ మోగించిన నల్లజాతి యువకుడి(Black teenager)పై ఓ 84 ఏళ్ల శ్వేతజాతీయుడు(White man) ఏప్రిల్ 13న కాల్పులు జరిపాడు. 16 ఏళ్ల రాల్ఫ్ తన తోబుట్టువులను పికప్ చేసుకోవడానికి తప్పు చిరునామాకు వెళ్లాడు. ఆ క్రమంలో అతని ఇంటి డోర్ బెల్ రెండు సార్లు మోగించాడు. దీంతో కోపోద్రిక్తుడైన 84 ఏళ్ల లెస్టర్ డోర్ తీసి అతని తల, చేతిపై రెండు సార్లు కాల్పులు జరిపాడు. దీంతో తీవ్ర గాయాలపాలన ఆ యువకుడు ఆస్పత్రి పాలయ్యాడు. అయితే అతని పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.
మరోవైపు ఈ ఘటనపై కేసు నమోదు చేసిన అక్కడి పోలీసులు లెస్టర్ ను అదుపులోకి తీసుకున్నారు. తర్వాత కొన్ని గంటల తర్వాత అతన్ని బెయిల్పై విడుదల చేశారు. అతనికి 200,000 డాలర్ల జరిమానాతోపాటు అతను ఎలాంటి ఆయుధాలను కలిగి ఉండకుండా నిషేధించారు. దీంతోపాటు అతను తన కుటుంబంతో ప్రత్యక్ష లేదా పరోక్ష సంబంధాలు కలిగి ఉండకూడదని ఆదేశించారు. మరోవైపు అతని విడుదల పట్ల పలువురు ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతేకాదు ఈ ఘటనపై అమెరికా అధ్యక్షుడు బైడెన్(biden) సహా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్(kamala harris) కూడా స్పందించడం విశేషం. ఆ యువకుడి ఆరోగ్యం గురించి వివరాలు ఆరా తీసినట్లు తెలిసింది.