ఓ మహిళ అర్ధరాత్రి ఒంటరిగా రోడ్డుపైకి వచ్చింది. ఒంటిపై నూలుపోగు లేకుండా కనిపించింది. ఇంటిముందు డోర్ బెల్ కొట్టి.. ఆ తర్వాత అక్కడినుంచి వెళ్లిపోయింది. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ రాంపూర్‌లో గల మిలాక్ గ్రామంలో జరిగింది. గత నెల 29వ తేదీన జరగగా స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ వీడియో సోషల్ మీడియాలో షేర్ చేయడంతో వైరల్ అవుతుంది.
విషయం తమ దృష్టికి వచ్చిందని రాంపూర్ పోలీసులు తెలిపారు. 3వ తేదీన వీడియోను పోలీస్ అధికారి షేర్ చేశారు. ఆ మహిళ పరిసర స్టేషన్లలో ఉందా కనుక్కొవాలని పంపించారు. ఫుటేజీని కూడా పరిశీలిస్తున్నామని తెలిపారు. ఆ తర్వాత అసలు విషయం తేలింది.
ఆ మహిళకు మతిస్థిమితం లేదని పోలీసులు తెలిపారు. గత ఐదేళ్ల నుంచి ఆమె చికిత్స తీసుకుంటున్నారని పేర్కొన్నారు. బరేలి జిల్లా ఆస్పత్రిలో ట్రీట్మెంట్ ఇప్పిస్తున్నామని తల్లిదండ్రులు తెలిపారు. ఆమెను కనిపెట్టుకుంటూ ఉండాలని పోలీసులు సూచించారు. తప్పుడు సమాచారం సోషల్ మీడియాలో పోస్ట్ చేయొద్దని స్థానికులను కోరారు. ఇది భయం, ఆందోళన కలిగించేందుకు కారణం అవుతుందని తెలిపారు.
వీడియో గురించి పోలీసులు స్పష్టత ఇచ్చారు. వీడియో చూస్తే మాత్రం భయమేస్తోంది. ఒంటరిగా.. బట్టలు లేకుండా ఎందుకు వచ్చి డోర్ బెల్ కొడుతుందని అంతా అనుకుంటారు. మరికొందరు క్షుద్రపూజలు అని అంటున్నారు. మతిస్థిమితం లేదని తెలిసి.. ఈ కేసు సాల్వ్ కావడంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు.