SRD: న్యాల్కల్ మండలం మిర్జాపూర్ (బి) గ్రామంలో ఆర్టీసీ బస్సులు ఆపడం లేదంటూ పలు గ్రామాల ప్రజలు, విద్యార్థులు కలిసి గురువారం ధర్నా చేపట్టారు. తమ గ్రామం మీదుగా జహీరాబాద్ డిపోకు చెందిన బస్సులు తమ గ్రామం మీదుగా రాయికోడ్ చౌరస్తా, రాయిపల్లి, ఖేడ్, వట్పల్లి తదితర గ్రామాలకు బస్సులు వెళుతుంటాయని తెలిపారు. దాదాపు అరగంటకు పైగా బస్సులను ఆపివేశారు.