HYD: ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న జీహెచ్ఎంసీ భారీగా పేరుకుపోయిన రూ. 3,000 కోట్ల ఆస్తి పన్ను బకాయిలపై ఉక్కుపాదం మోపుతోంది. ఇప్పటికే లక్షన్నర మందికి పైగా బకాయిదారులకు ‘రెడ్ నోటీసులు’ జారీ చేసింది. గడువులోపు చెల్లించకపోతే సెక్షన్ 269 కింద ఆస్తుల జప్తు, వేలం వేస్తామని హెచ్చరించింది. ప్రభుత్వ భవనాలే వెయ్యి కోట్ల వరకు బాకీ ఉండటం గమనార్హం.