మైక్రోసాఫ్ట్ మద్దతుతో ప్రసిద్ధి చెందిన AI చాట్‌బాట్ అయిన ChatGPTని ఎదుర్కోవడానికి తాను కూడా AI మోడల్‌ను రూపొందిస్తానని ట్విట్టర్ CEO ఎలాన్ మస్క్(Elon Musk) అన్నారు. ఇటీవల ఫాక్స్ న్యూస్ కు ఇచ్చిన ఇంటర్య్వూలో భాగంగా వెల్లడించారు.
బిలియనీర్, ట్విటర్ యజమాని ఎలాన్ మస్క్(Elon Musk) మానవాళికి కృత్రిమ మేధస్సు ద్వారా ప్రమాదాలు సంభవించే అవకాశం ఉందని తాజాగా మరోసారి పేర్కొన్నారు. ఈ క్రమంలో ఒక ప్రముఖ చాట్‌బాట్ ను ఎదుర్కొనేందుకు.. తన స్వంత AI సృష్టిని తీసుకురానున్నట్లు వెల్లడించారు. మస్క్ సోమవారం రాత్రి ప్రసారమైన ఫాక్స్ న్యూస్ హోస్ట్ టక్కర్ కార్ల్సన్తో మాట్లాడిన క్రమంలో ఈ వ్యాఖ్యలు చేశారు. ఆ నేపథ్యంలో తాను TruthGPTని సృష్టించనున్నట్లు చెప్పారు. ఇది “గరిష్ట సత్యాన్వేషణ AIగా ఉంటుందని, ఇది విశ్వం యొక్క స్వభావాన్ని కూడా అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తుందని పేర్కొన్నారు.
మస్క్ చివరకు TruthGPTని ప్రారంభించినట్లయితే అతను కేవలం ChatGPT మాత్రమే కాకుండా Google బార్డ్ వంటి ఇతర AI సిస్టమ్‌లతో కూడా పోటీపడనున్నాడు. ఓపెన్ ఏఐ గూగుల్‌కు అనుబంధంగా వర్క్ చేస్తుందని గుర్తు చేశారు. కార్లు లేదా రాకెట్ల కంటే AI చాలా ప్రమాదకరమైనదని. ఇది మానవాళిని నాశనం చేసే సామర్థ్యాన్ని కలిగి ఉందని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు.
ChatGPT విమర్శకులు ఇది రాజకీయ పక్షపాతంతో సమాధానాలను రూపొందిస్తుందని పేర్కొన్నారు. ఫిబ్రవరిలో చాట్‌జిపిటి మాజీ యుఎస్ ప్రెసిడెంట్ డోనాల్డ్ ట్రంప్ గురించి ఒక కవితను రూపొందించడానికి నిరాకరించింది. అయితే ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్ గురించి థ్రిల్లింగ్‌గా రాసిందని పేర్కొన్నారు. ChatGPT ఏఐ కొన్ని సంస్థలకు అనుకూలంగా ఉంటూ మరికొంత మంది విషయంలో పక్షపాతంగా వ్యవహరిస్తుందని మస్క్ అభిప్రాయం వ్యక్తం చేశారు.
నెవాడా బిజినెస్ ఫైలింగ్ ప్రకారం విడిగా మస్క్ X.AI కార్ప్ అనే కొత్త వ్యాపారాన్ని ఏర్పాటు చేశాడు. ఈ వ్యాపారం మార్చి 9న ఏర్పడిందని పేర్కొన్నారు. మస్క్‌ని డైరెక్టర్‌గా, తని దీర్ఘకాల సలహాదారు జారెడ్ బిర్చాల్‌ను కార్యదర్శిగా ఉన్నట్లు ప్రకటించారు. అంతేకాదు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి మస్క్ చాలా సంవత్సరాలుగా తన స్పష్టమైన అభిప్రాయాలను కల్గి ఉన్నాడు. మార్క్ జుకర్‌బర్గ్, బిల్ గేట్స్‌తో సహా ఇతర టెక్ లీడర్లతోపాటు అతను భిన్నమైన తీరును కల్గి ఉండటం విశేషం.
మరోవైపు మస్క్(Elon Musk) గతంలో చాట్‌జిపిటి వెనుక ఉన్న ఓపెన్ ఏఐ స్టార్టప్‌లో ప్రారంభ పెట్టుబడిదారుడు. 2015లో లాభాపేక్షలేని AI రీసెర్చ్ ల్యాబ్‌గా స్థాపించబడిన తర్వాత దాని బోర్డుకు సహ-అధ్యక్షుడు. కానీ మస్క్ అక్కడ కొన్ని సంవత్సరాలు మాత్రమే కొనసాగాడు. శాన్ ఫ్రాన్సిస్కో స్టార్టప్ ఆటోమేటెడ్ డ్రైవింగ్ సిస్టమ్‌లను నిర్మించడంలో టెస్లా పనితో ముడిపడి ఉన్న చర్యలో 2018 ప్రారంభంలో బోర్డు నుంచి రాజీనామా చేశాడు. టెస్లా AIపై మరింత దృష్టి కేంద్రీకరించడం కొనసాగిస్తున్నందున.. ఇది ఎలాన్ మాస్క్ కు మరింత భవిష్యత్ అవకాశంగా మారనుంది. ఫిబ్రవరి 2018 బ్లాగ్ పోస్ట్‌లో OpenAI తెలిపింది.