NLG: చందంపేటలో ఎస్సీల సంక్షేమ పథకాల సాధనకై ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షుడు కొండ్రపల్లి నాగేష్ మాదిగ ఆధ్వర్యంలో కరపత్రాలను గురువారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సమస్యల పరిష్కారం కోసం మార్చి 30న ఇందిరా పార్క్ వద్ద జరిగే నిరాహార దీక్షకు వేలాదిగా తరలి రావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పగిడిమర్రి రవీందర్, కొండ్రపల్లి సత్యనారాయణ ఉన్నారు.