మెగా పవర్ స్టార్ రామ్ చరణ్(Ram Charan) భార్య ఉపాసన (Upasana) గురించి అందరికీ తెలిసిందే. ఉపాసనకు సోషల్ మీడియాలో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. మెగా కోడలిగా ఈమె అనేక సేవా కార్యక్రమాలు చేస్తోంది. మెగాస్టార్ చిరంజీవి(Megastar Chiranjeevi) ఇంటికి కాస్త దూరంలోనే రామ్ చరణ్, ఉపాసన ఇల్లు కూడా ఉంది. ఆదివారం రామ్ చరణ్, ఉపాసన దంపతులు చిరంజీవి ఇంట్లో గడిపిన వీడియో సోషల్ మీడియాలో వైరల్(Viral) అవుతోంది. మెగా కోడలు ఉపాసన ఈ సందర్భంగా నెట్టింట ఓ వీడియోను షేర్ చేసింది. ప్రస్తుతం ఆ వీడియో వైరల్(Video Viral) అవుతోంది.
రామ్ చరణ్(Ram Charan), ఉపాసన(Upasana) దంపతులు సండే స్పెషల్‌గా చిరంజీవి(Megastar Chiranjeevi) ఇంట్లో సందడి చేశారు. ఉపాసన ప్రస్తుతం గర్భవతి కావడంతో ఆమెకు నచ్చిన వంటను చేసినట్లు తెలుస్తోంది. మెగాస్టార్ చిరంజీవి తల్లి అంజనా దేవి(Anjana devi) దగ్గరుండి ఉపాసన కోసం ఓ వంటను చేయించారు. వేడి వేడి పులావ్ ను ఉపాసన కోసం చేయిస్తున్న వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్(Viral) అవుతోంది. పులావ్‌లో కొత్తిమీర, పుదీనా ఎంత మేరకు వేయాలో అంజనా దేవి చెబుతున్న వీడియోను ఉపాసన షేర్ చేశారు.
మెగా కోడలు ఉపాసన(Upasana) కోసమే ఆ పులావ్ చేసినట్లు తెలుస్తోంది. వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉపాసన ఓ నోట్‌ను రాశారు. ”ప్రేమతో నిండిపోయిన సండే స్పెషల్ పులావ్..ఇంతకంటే నాకు ఇంకేం కావాలి” అంటూ రాసుకొచ్చారు. ప్రస్తుతం ఉపాసన షేర్ చేసిన వీడియో నెట్టింట వైరల్(Video Viral) అవుతోంది. ఈ వీడియోకు మెగా ఫ్యాన్స్ ఆనందంతో కామెంట్స్ చేస్తున్నారు.