ప్రతి కుటుంబానికి వంటిల్లు(Kitchen) అనేది ప్రకృతి ఫార్మసీ(Natural Pharmacy). చాలా వ్యాధులను వంటింటి పదార్థాలు(Kitchen Ingredients) పూర్తిగా నయం చేయగలవు. వంటింట్లో లభించే జీలకర్ర, మెంతులు, లవంగాలు, అల్లం, యాలకులు, మిరియాలు వంటివి ప్రతి ఒక్కరికీ ఔషధ గుణాలుగా ఉపయోగపడతాయి. జలుబు నుంచి క్యాన్సర్(Cancer) వరకూ ప్రతి అనారోగ్య సమస్యకు వంటింటి పదార్థాలు దివ్యౌషధంగా ఉపయోగపడతాయి. మరి ఆ పదార్థాలేంటి? వాటి ఉపయోగాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
లవంగా(Clove)ల్లో మంచి ఔషధ గుణాలున్నాయి. లవంగాలను ఆహారంలో భాగం చేసుకుంటే పళ్లు(Teeths), చిగుళ్లు వంటివి దెబ్బతినకుండా ఉండటమే కాకుండా నోటి దుర్వాసన(Mouth smell)ను దూరం చేస్తుంది. నోటి సంబంధిత వ్యాధులు రాకుండా కాపాడుతుంది. ఆహారం జీర్ణం కాకపోతే ఓ రెండు లవంగాలను నోట్లో వేసుకుని చప్పరిస్తే సరి. వికారం కలగకుండా లవంగం ఉపయోగపడుతుంది. జలుబు, దగ్గు లాంటి సమస్యలకు తక్షణ పరిష్కారం లవంగం. విపరీతమైన తలనొప్పి(Headache) ఉంటే లవంగా(Clove)లను తీసుకుంటే ఉపశమనం కలుగుతుంది. అల్సర్ సమస్యలను లవంగాలు దూరం చేస్తాయి. క్యాన్సర్ కణాలు వృద్ధి చెందకుండా లవంగాలు అడ్డుకుంటాయి.
జీలకర్ర నీటి(Cumin Water)ని తాగితే అనేక సమస్యల నుంచి ఉపశమనం పొందొచ్చు. తరచూ జీలకర్ర నీరు తాగుతుంటే అసిడిటీ(ACDT), గ్యాస్, అజీర్ణం వంటి సమస్యలు రావు. జీలకర్ర నీరు ఓ పెయిన్ కిల్లర్ లా పనిచేస్తుంది. కడుపునొప్పి వేధిస్తుంటే వెంటనే జీలకర్ర నీరు తాగడం ఎంతో మంచిది. జీర్ణ సమస్యలు, పొట్ట సమస్యలు జీలకర్ర నీటితో పరార్ అవుతాయి.
అల్లం(Ginger) వరకూ అనేక లాభాలున్నాయి. ముఖ్యంగా మహిళల(Womens)కు అల్లం వల్ల చక్కటి ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. పీరియడ్స్ టైంలో అల్లం ముక్కను నమిలితే నొప్పి, తిమ్మర్లు వంటివి ఉండవు. మధుమేహం ఉండేవారు ఖాళీ కడుపుతో అల్లం తింటే చక్కెర స్థాయిలో అదుపులో ఉంటాయి. రోజూ అల్లం నీటిని తాగుతుంటే గుండె జబ్బులు వచ్చే ప్రమాదం తగ్గతుంది. అయితే గర్భిణులు అల్లం ఎక్కువగా తినకూడదు. బీపీ(BP) ఉండేవారు అల్లం తక్కువగానే వాడాలి. వేసవి(Summer)లో అల్లం వాడకం తగ్గించాలి.
మిరియాల(Pepper) వల్ల జీర్ణ వ్యవస్థ అద్భుతంగా ఉంటుంది. కడుపునొప్పి ఉంటే మిరియాలను నీటిలో వేసి నానబెట్టి తాగాలి. మిరియాల నీరు ఖాళీ కడుపుతో తాగితే శరీరంలోని వ్యర్థాలు బయటకు పోతాయి. మిరియాల వల్ల చర్మ సమస్యలు(Skin Problems) కూడా రావు. మిరియాల కషాయం దగ్గు, జలుబు, జ్వరం వంటివాటిని నయం చేస్తుంది. మిరియాల పొడి జీర్ణ వ్యవస్థను సాఫీగా సాగేలా చేస్తుంది.