చైనా మాస్టర్స్ సూపర్ 750 బ్యాడ్మింటన్ టోర్నీలో పీవీ సింధు తొలి రౌండ్లో సునాయాసంగా విజయం సాధించింది. తొలి రౌండ్లో డెన్మార్క్ ప్లేయర్ లిన్ క్రిస్టోఫర్సన్పై సింధు 21-4, 21-10 తేడాతో గెలిచింది. ఈ మ్యాచ్లో సింధు ఆరంభం నుంచీ పూర్తి ఆధిపత్యం ప్రదర్శించింది. ప్రత్యర్థికి ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా మ్యాచ్ను ముగించి ప్రీ-క్వార్టర్స్లోకి ప్రవేశించింది.