NGKL: అచ్చంపేట నియోజకవర్గం బల్మూరు మండలం చెంచుగూడెం గ్రామంలో ఉన్న గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాలను అచ్చంపేట ఎమ్మెల్యే వంశీకృష్ణ ఇవాళ సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజా ప్రభుత్వం విద్యార్థుల సంక్షేమం కోసం మెస్ చార్జీలను, కాస్మెటిక్ ఛార్జీలను పెంచిందని తెలిపారు. ప్రభుత్వ పాఠశాల విద్యా అభివృద్ధికి కృషి ప్రభుత్వం కృషి చేస్తుందని పేర్కొన్నారు.