ADB: భారీ వర్షాల నేపథ్యంలో దెబ్బతిన్న రోడ్డు మార్గాలకు మరమ్మతులు చేపట్టాలని కలెక్టర్ రాజర్షి షా సూచించారు. పట్టణంలో మంగళవారం మున్సిపాలిటీ నీటిపారుదల శాఖ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. వరద ప్రభావిత ప్రాంతాలను పరిశీలించి, తగిన ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. సంబంధిత జాబితాను వీలైనంత త్వరగా అందజేయాలని కోరారు.