NZB: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న భూభారతి దరఖాస్తుల పరిశీలనలో జాప్యానికి తావు లేకుండా వెంటదివెంట ఆర్జీలను పరిష్కరించాలని కలెక్టర్ టీ. వినయ్ కృష్ణారెడ్డి ఆదేశించారు. మంగళవారం ఆయన సాలూర తహసీల్దార్ కార్యాలయాన్ని తనిఖీ చేశారు. రెవెన్యూ రికార్డులను పరిశీలించారు. బోధన్ సబ్ కలెక్టర్ వికాస్ మహతో తో కలిసి మండలంలో భూభారతి అమలు తీరుపై సమీక్షించారు.