TPT: తిరుపతి జిల్లా నూతన ఎస్పీగా బాధ్యతలు స్వీకరించిన సుబ్బరాయుడును చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని జిల్లా ఎస్పీ కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఇందులో భాగంగా నియోజకవర్గ పరిధిలోని శాంతి భద్రతల గురించి ఇరువురు చర్చించుకున్నారు. నియోజకవర్గంలోని పోలీస్ స్టేషన్లలో సిబ్బంది కొరత, గంజాయి నిర్మూలనకు చర్యలు చేపట్టాలని ఎస్పీని ఎమ్మెల్యే కోరారు.