KMM: ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం అన్ని రకాల పెన్షన్లను తక్షణమే పెంచాలని ఎమ్మార్పీఎస్ జిల్లా నాయకులు కనకపూడి శ్రీనివాస్ మాదిగ అన్నారు. సోమవారం MRPS, VHPS ఆధ్వర్యంలో మధిర మండల తహసీల్దార్ రాంబాబుకు వినతి పత్రం అందించారు. వృద్ధులు, వికలాంగులకు ఎన్నికల సమయంలో పెన్షన్ను పెంచుతామని హామీ ఇచ్చి ఇప్పుడు అమలు చేయకపోవడం సరికాదన్నారు.