VZM: మహిళల ఆరోగ్య పరిరక్షణకు స్వస్త్ నారీ సశక్తి పరివార్ అభియాన్ పథకం ఎంతో దోహదం చేస్తుందని జాయింట్ కలెక్టర్ ఎస్.సేతు మాధవన్ అన్నారు. ఈ పథకానికి సంబంధించి గోడ పత్రికను ఆయన కలెక్టరేట్లో సోమవారం ఆవిష్కరించారు. దీని ద్వారా వివిధ రకాల స్క్రీనింగ్ పరీక్షలను నిర్వహించి, అవసరమైనవారికి తగిన వైద్య సదుపాయాన్ని అందించాలన్నారు.