GNTR: వేలగపూడి సచివాలయంలోని అసెంబ్లీ హాల్లో సోమవారం ఐఎన్డిడబ్ల్యు ఎస్పీ ఆరిఫ్ హఫీజ్ ఆధ్వర్యంలో వివిధ శాఖల అధికారులతో భద్రతా ఏర్పాట్ల సమీక్ష జరిగింది. గుంటూరు జిల్లా ఎస్పీ జిందాల్ కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆరిఫ్ హఫీజ్ మాట్లాడుతూ.. వీవీఐపీ, వీఐపీ, మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రభుత్వ ఉన్నతాధికారుల ప్రయాణ మార్గాలలో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు.