GNTR: తుళ్లూరు, మంగళగిరి, తాడేపల్లి లైసెన్స్డ్ ఇంజినీర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సోమవారం చినకాకానిలో జాతీయ ఇంజినీర్ల దినోత్సవం నిర్వహించారు. ముఖ్య అతిథిగా మున్సిపల్ కమిషనర్ అలీమ్ భాషా హాజరయ్యారు. ముందుగా ఇంజినీర్ల పితామహుడు మోక్షగుండం విశ్వేశ్వరయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.