NGKL: లింగాల మండలంలోని దారారం గ్రామానికి చెందిన బిచ్చయ్య అనారోగ్యంతో బాధపడుతున్నాడు. సోమవారం లింగాల గురుకుల పాఠశాల 2008 09 బ్యాచ్ విద్యార్థులు తమ గురువును పరామర్శించి రూ.5000 ఆర్థిక సహాయం అందజేశారు. గురువుకు అండగా నిలిచిన యువకులను పలువురు అభినందించారు. కార్యక్రమంలో శివయ్య, నాగరాజు, చంద్రశేఖర్, విష్ణు, మహేష్ పాల్గొన్నారు.