ATP: గుంతకల్లు రామిరెడ్డి కాలనీలో మౌలిక వసతులు కల్పించాలని డిమాండ్ చేస్తూ సోమవారం సీపీఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీ ఆధ్వర్యంలో మున్సిపాలిటీ కార్యాలయం ఎదురుగా నిరసన కార్యక్రమం చేపట్టారు. డివిజన్ కార్యదర్శి సురేష్ మాట్లాడుతూ.. కాలనీలో సీసీ రోడ్లు లేక ఇబ్బందులు పడుతున్నామని అధికారులు స్పందించి, తక్షణమే కాలనీలో మౌలిక వసతులు ఏర్పాటు చేయాలన్నారు.