VZM: కొత్తవలస మండలంలో ఉన్న పలు సచివాలయాల్లో యూరియా సరఫరా తీరును మండల తహసీల్దార్ అప్పలరాజు ఆధ్వర్యంలో సోమవారం ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. భూమికి సంబంధించిన రికార్డులను క్షుణ్ణంగా పరిశీలించి రసీదులు ఇవ్వాలని సిబ్బందికి సూచించారు. ఈ తనిఖీల్లో వ్యవసాయ సహాయ సంచాలకులు భానులత, వ్యవసాయ అధికారి రాంప్రసాద్, సచివాలయం సిబ్బంది పాల్గొన్నారు.