ELR: పశువులకు గాలికుంటు వ్యాధి రాకుండా ముందు జాగ్రత్త చర్యగా టీకాలు వేస్తున్నామని పశుసంవర్ధక శాఖ డిప్యూటీ డైరెక్టర్ డా.సుధాకర్ తెలిపారు. గణపవరం మండలం చిన్నరామచంద్రపురంలో సోమవారం 65 పశువులకు గాలికుంటు వ్యాధి నివారణ టీకాలు వేశారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ డైరెక్టర్ డాక్టర్ డి.ఎం.నాయక్ కూడా పాల్గొన్నారు.