ముంబై నగరాన్ని భారీ వర్షాలు ముంచెత్తాయి. రాత్రి నుంచి కురుస్తున్న వర్షాలకు రహదారులు చెరువులను తలపిస్తున్నాయి. దీంతో పలు చోట్ల ట్రాఫిక్ జామ్ ఏర్పడడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఆర్థిక రాజధానిలో మరో మూడు గంటల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం పడుతుందని వాతావరణ శాఖ హెచ్చరించింది. దీంతో నగరానికి రెడ్ అలర్ట్ జారీ చేసింది.