ప్రకాశం: ఇంజనీర్స్ డే సందర్భంగా నేడు దేశమంతా మోక్షగుండం విశ్వేశ్వరయ్యను స్మరిస్తుంది. ఇంజినీర్లందరూ ఆయనే ఆదర్శమని గర్వంగా చెబుతుంటారు. ఆయన జయంతి సందర్భంగానే ఇంజినీర్స్ డేను జరుపుకుంటారు. విశ్వేశ్వరయ్య పూర్వీకులు బి.పేట మండలంలోని మోక్షగుండం వాసులే. ఈయనను మోక్షగుండం ప్రజలు నేటికీ ఆరాధిస్తారు. ముంబై, పూణే, హైదరాబాద్లో వంతెనలు నిర్మించి వరదల నుంచి కాపాడిన ఘనత ఈయన సొంతం.