MDK: రామాయంపేట మండల కేంద్రంలో యూరియా కోసం రైతులు రోడ్డు ఎక్కారు. గత 15 రోజులుగా యూరియా లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని సోమవారం ఉదయం ప్రాథమిక సహకార సంఘం మద్దతు చేరుకున్నా రైతులు ఆందోళన చేపట్టారు. యూరియా లారీ రాకపోవడంతో రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. తమకు సరిపడా యూరియా సరఫరా చేయాలని రైతుల డిమాండ్ చేస్తున్నారు.