VSP: స్త్రీ శక్తి పథకంతో జిల్లాలోని బస్సుల్లో రద్దీ పెరిగిందని, RTC ప్రయాణికులు తమ ప్రయాణ సమయాలను మార్చుకోవాలని RTC విశాఖ రీజనల్ మేనేజర్ అప్పలనాయుడు సూచించారు. రద్దీకి తగ్గట్లు ప్రస్తుతం ఉన్న బస్సులు సరిపోవడం లేదన్నారు. ఉదయం 7 నుంచి 10, సా.4- 7 గంటల వరకు విద్యార్థులు, కార్మికులు, ఇతర ప్రయాణికుల రద్దీ ఉంటోందని తెలిపారు.