MDK: తూప్రాన్ డివిజన్లో విద్యుత్ సమస్యల పరిష్కారానికి ప్రజా బాట నిర్వహిస్తున్నట్లు తూప్రాన్ విద్యుత్ శాఖ డీఈ గరత్మంత్ రాజ్ పేర్కొన్నారు. తూప్రాన్ మండలం నాగులపల్లి శివారులోని వీరబ్రహ్మేంద్ర స్వామి ఆలయం వద్ద ప్రజాబాట కార్యక్రమం చేపట్టారు. విద్యుత్ సమస్యలను దృష్టికి తీసుకువస్తే పరిష్కరిస్తామని పేర్కొన్నారు. ఏడిఈ శ్రీనివాస్, ఏఈ వెంకటేశ్వర్లు తెలిపారు.