ప్రకాశం: సింగరాయకొండ మండలం పాకాల సముద్రతీరంలో సుందర దృశ్యం కనిపించింది. సోమవారం ఉదయం సముద్ర తీరానికి వెళ్లిన ఓ పర్యటకుడు తన మొబైల్లో సుందర దృశ్యాన్ని చిత్రీకరించాడు. ఉదయం 6 నుంచి 7 గంటల మధ్యలో సూర్యోదయ సమయంలో ఈ ఫొటో చిత్రీకరించాడు. సముద్రం అలలు కూడా ప్రశాంతంగా వస్తుండడంతో పర్యటకులు సముద్ర గాలిని ఆస్వాదించారు.