NZB: శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు వద్ద పర్యాటకుల సందడి కనిపిస్తోంది. వర్షాకాలం కారణంగా ప్రాజెక్టులో నీటిమట్టం పెరగడంతో గేట్లను ఎత్తి నీటిని దిగువకు వదిలిపెడుతున్నారు. దీంతో ఆహ్లాదకరమైన దృశ్యాలను చూసేందుకు పర్యాటకులు తరలివస్తున్నారు. అధికారులు పర్యాటకుల భద్రత కోసం ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. నీటిమట్టం పెరుగుతున్న దృష్ట్యా గేట్ల దగ్గర హెచ్చరిక బోర్డు పెట్టారు.