హాంకాంగ్ ఓపెన్ పురుషుల బ్యాడ్మింటన్ సింగిల్స్ ఫైనల్స్లో భారత ప్లేయర్ లక్ష్యసేన్ ఓటమిపాలయ్యాడు. ఈ మ్యాచ్లో చైనా షట్లర్ లి షి ఫెంగ్ చేతిలో లక్ష్యసేన్ 21-15, 21-12 తేడాతో వరుస సెట్లలో ఓడిపోయాడు. దీంతో సిల్వర్ మెడల్ దక్కించుకున్నాడు. విజేతగా నిలిచిన లి షి ఫెంగ్ గోల్డ్ మెడల్ కైవసం చేసుకున్నాడు. కాగా, ఈ టోర్నీలోని అన్ని ఈవెంట్లను చైనా క్లీన్ స్వీప్ చేసింది.