TG: HYDలోని పలు ప్రాంతాల్లో వర్షం కురుస్తోంది. సికింద్రాబాద్ పరిధిలోని తార్నాక, ఓయూ క్యాంపస్, లాలాపేట్ ప్రాంతాల్లో వర్షం పడుతోంది. హబ్సిగూడ, నాచారం, మల్లాపూర్ ప్రాంతాల్లో రోడ్లన్ని జలమయమయ్యాయి. కాగా, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, కామారెడ్డి జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ ప్రకటించింది.