ASF: కాంగ్రెస్ పార్టీ చేస్తున్న అభివృద్ధి పనులను చూసి కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారని ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఎమ్మెల్సీ దండే విఠల్ అన్నారు. ఈ సందర్భంగా ఆదివారం కాగజ్ నగర్ పట్టణానికి చెందిన పలువురు యువకులు కాంగ్రెస్ పార్టీలో చేరారు. వారికి ఎమ్మెల్సీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కాంగ్రెస్ తోనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యమని అన్నారు.