TPT: తిరుమల శ్రీవారి ఆలయంలో బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని 16న కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించనున్నారు. ఆలయ శుద్ధి, కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం అనంతరం భక్తులకు దర్శనం కల్పిస్తారు. 15న వీఐపీ బ్రేక్ దర్శనాల సిఫార్సు లేఖలు స్వీకరించబడవని టీటీడీ స్పష్టం చేసింది. ఈ సందర్భంగా అష్టదళ పాదపద్మారాధన, వీఐపీ బ్రేక్ దర్శనాలను టీటీడీ రద్దు చేసింది.