CTR: విజయపురం మండలంలో ఆదివారం మాజీ మంత్రి రోజా పర్యటించారు. స్థానిక వైసీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఆమెకు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మండలంలోని రాజకీయ పరిస్థితులపై నాయకులు రోజాకు వివరించారు. మండలంలో పార్టీ అభివృద్ధికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని రోజా నాయకులు, కార్యకర్తలకు సూచించారు.