ADB: సిరికొండ మండల కేంద్రంలో బీఆర్ఎస్ నాయకులు ఆదివారం సమావేశం ఏర్పాటు చేశారు. బీఆర్ఎస్ మండల నాయకుడు పెంటన్న మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీకి పాలన మీద చిత్తశుద్ధి లేకనే రైతులు అవస్థలకు గురికావాల్సి వస్తుందన్నారు. యూరియా కొరతకు కాంగ్రెస్ పార్టీనే ప్రధాన కారణం అని ఆరోపించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలిచేది బీఆర్ఎస్ పార్టీయే అని ధీమా వ్యక్తం చేశారు.