ఉమ్మడి విశాఖ జిల్లాలో శనివారం జాతీయ లోక్ అదాలత్ నిర్వహించారు. మొత్తం 10,190 కేసులు రాజీ చేయగా రూ.25 కోట్ల విలువైన సమస్యలు పరిష్కారం అయ్యాయని జిల్లా ప్రధాన న్యాయమూర్తి చిన్నం శెట్టి రాజు తెలిపారు. బాధితులకు నాలుగు కోట్ల నలభై లక్షల పైబడి పరిహారం అందజేశామని, 36 బెంచీలు ఏర్పాటు చేయగా కేసులు పరిష్కరించడంలో ఉమ్మడి విశాఖ జిల్లా నాలుగో స్థానంలో ఉందన్నారు.