కృష్ణా: జిల్లా వ్యాప్తంగా ఏర్పాటు చేసిన 42 లోక్ అదాలత్ బెంచ్‌లలో మొత్తం 16,599 కేసులను పరిష్కరించినట్లు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఛైర్మన్ గుట్టల గోపి శనివారం రాత్రి తెలిపారు. లోక్ అదాలత్‌లో రాజీ ద్వారా కేసులను పరిష్కరించుకోవడం వల్ల సమయం, డబ్బు ఆదా అవుతాయని ఆయన పేర్కొన్నారు. ఈ ప్రక్రియలో జిల్లా న్యాయమూర్తులు, పోలీసులు కూడా పాల్గొన్నారు.