»I Did This For Jagan The Accused In The Kodikatthi Case
CM Jagan : జగన్ కోసమే ఇలా చేశాను..కోడికత్తి కేసులో నిందితుడు..!
గత ఎన్నికలకు ముందు జగన్ పై ఎయిర్ పోర్టులో ఓ యువకుడు కోడి కత్తితో దాడి చేసిన సంగతి తెలిసిందే. ఈ సంఘటన ఆ సమయంలో తీవ్ర వుమారం రేపింది. ఇప్పటికీ ఈ కేసును ఎన్ఐఏ దర్యాప్తు చేస్తోంది. ఈ ఘటనలో ఎలాంటి కుట్రలేదని ఇటీవల ఎన్ఐఏ పేర్కొంది.
గత ఎన్నికలకు ముందు జగన్ పై ఎయిర్ పోర్టులో ఓ యువకుడు కోడి కత్తితో దాడి చేసిన సంగతి తెలిసిందే. ఈ సంఘటన ఆ సమయంలో తీవ్ర వుమారం రేపింది. ఇప్పటికీ ఈ కేసును ఎన్ఐఏ దర్యాప్తు చేస్తోంది. ఈ ఘటనలో ఎలాంటి కుట్రలేదని ఇటీవల ఎన్ఐఏ పేర్కొంది. కుట్రను వెలికి తీసేలా దర్యాప్తు చేయాలంటూ సిఎం జగన్ వేసిన పిటిషన్ కు విచారణార్హత లేదని, జగన్ పిటిషన్ ను కొట్టివేయాలని కోర్టును కోరింది. విచారణ సమయంలో నిందితుడు శ్రీనివాసరావు చెప్పిన వివరాలను కూడా కోర్టుకు అందజేసింది.
విచారణలో శ్రీనివాసరావు ఏం చెప్పాడంటే… “జగన్ అంటే నాకు చాలా ఇష్టం. జగన్ అధికారంలోకి రావాలని కోరుకున్నా. మీడియా ద్వారా జగన్ కు సానుభూతి వచ్చేందుకే కోడికత్తితో దాడి చేశాను. జగన్ ను పొడిచిన కోడికత్తిని రెండు సార్లు స్టెరిలైజ్ చేశాను, ఎయిర్ పోర్టులో జగన్ కు టీ ఇచ్చేందుకు వెళ్లి… మీరు 160 సీట్లతో గెలుస్తారని చెప్పాను. దానికి ఆయన చిరునవ్వు నవ్వారు. జగన్ ను పొడిచిన వెంటనే వైఎస్ఆర్సిపి వాళ్లు నన్ను బాగా కొట్టారు. పోలీసులు వారి నుంచి నన్ను కాపాడి ఒక గదిలో బంధించారు. ఆ తర్వాత పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లారు.
అప్పట్లో విచారణ సందర్భంగా ఏపీ పోలీసులు నన్ను బాగా కొట్టారు. నా సొంత ఆలోచన మేరకే జగన్ పై దాడి చేశానని నేను చెప్పాను. ఒక పార్టీకి అనుకూలంగానో, వ్యతిరేకంగానో చెప్పాలని పోలీసులు నాపై ఒత్తిడి తీసుకురాలేదు. అందుకే జడ్జి వద్ద పోలీసులపై నేను ఒక్క ఆరోపణ కూడా చేయలేదు. జగన్ అధికారంలోకి వస్తే సమస్యలు తీరుతాయని భావించాను. జగన్ కు, నా తల్లిదండ్రులకు క్షమాపణలు చెపుతున్నాను” అంటూ పేర్కొన్నాడు. శ్రీనివాసరావు చెప్పిన ఈ మాటల రికార్డును కోర్టుకు ఎన్ఐఏ అందించింది.