భారత స్టార్ బాక్సర్ జేస్మిన్ లాంబోరియా వరల్డ్ బాక్సింగ్ ఛాంపియన్షిప్లో గోల్డ్ మెడల్ సాధించారు. ఫైనల్లో జూలియా(POL)ను 4-1 తేడాతో ఓడించి పసిడిని ముద్దాడారు. ఈ బాక్సింగ్ ఈవెంట్లో భారత్కు ఇదే తొలి స్వర్ణ పతకం. కాగా మరో ఫైనల్స్లో నుపురు సిల్వర్ మెడల్.. పూజా రాణి బ్రాంజ్ మెడల్స్ సాధించారు.