W.G: జిల్లాలో మహిళల ఆరోగ్య పరిరక్షణకు పెద్ద ఎత్తున అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని జిల్లా కలెక్టర్ నాగరాణి అన్నారు. శనివారం భీమవారంలోని కలెక్టరేట్లో మాట్లాడారు. ‘స్వస్థ నారి – శసక్త్ పరివార్ అభియాన్’ కార్యక్రమంలో భాగంగా ఈ నెల 17 నుంచి అక్టోబర్ 2 వరకు ఆరోగ్య పరీక్షలు, చికిత్సలు, వైద్య నిపుణుల సేవలు అందిస్తామని పేర్కొన్నారు.