TPT: సూళ్లూరుపేటలోని డంపింగ్ యార్డ్‌ను తరలించేందుకు కొన్నెంబట్టు గ్రామ పరిసర ప్రాంతంలో ప్రభుత్వం 10 ఎకరాల భూమి కేటాయించింది. అయితే చెత్తను ఇక్కడ వేయద్దని పరిసర ప్రాంతాల ప్రజలు ఎమ్మెల్యే, కలెక్టర్‌కు విన్నవించుకున్నారు. దీనికి స్పందించిన ఎమ్మెల్యే గ్రామ ప్రజలతో కలిసి శనివారం డంపింగ్ యార్డ్‌ను కేటాయించిన భూమిని పరిశీలించారు. సమస్యను పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు.