NTR: నందిగామ బహుజన సమాజ్ పార్టీ నియోజకవర్గ ముఖ్య కార్యవర్గ సమావేశం ఇవాళ జరిగింది. జిల్లా అధ్యక్షుడు దొండపాటి శామ్యూల్ కుమార్ అధ్వక్షతన పార్టీ కార్యాలయంలో నిర్వహించారు. అనంతరం ఈనెల 24న విజయవాడలో జరిగే దళిత రణభేరి కరపత్రాలను విడుదల చేశారు. అయన మాట్లాడుతూ.. ప్రభుత్వాలు మారినా దళితుల మీద దాడులు మాత్రం నిరంతరం కొనసాగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.