SKLM: శ్రీకాకుళం రోడ్డు (ఆమదాలవలస) రైల్వే స్టేషన్ పరిధి ఊసవానిపేట రైల్వే గేటును ఆదివారం ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు మూసివేస్తున్నట్టు ఈస్ట్ కోస్ట్ రైల్వే సీనియర్ సెక్షన్ ఇంజనీర్ వెంకటేశ్వర్లు శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉర్లాం- శ్రీకాకుళం రోడ్ మధ్య ట్రాక్ మరమ్మత్తులు చేపడుతున్న నేపథ్యంలో మూసివేస్తున్నట్లు పేర్కొన్నారు. వాహనదారులు గమనించాలన్నారు.