NZB: సిరికొండ గ్రామంలో భారీ వర్షాల కారణంగా ప్రాథమిక పాఠశాలలో పునరావాసం పొందిన బాధితులను శనివారం భారతీయ జనతా పార్టీ గ్రామ నాయకులు పరామర్శించారు. జిల్లా అధ్యక్షులు శ్రీ దినేష్ పటేల్ కులచారి సహకారంతో, నిజామాబాద్ జిల్లా ఎంపీ శ్రీ ధర్మపురి అరవింద్ ఫౌండేషన్ ద్వారా బాధిత కుటుంబాలకు నిత్యావసర వస్తువులను అందజేశారు.