NGKL:పెద్దకొత్తపల్లి మండలంలోని దేవుని తిరుమలపురంలో శనివారం మధ్యాహ్నం పూరి గుడిసె దగ్ధమైన సంఘటన చోటుచేసుకుంది. బాధితుడు ఎరుకలి నాగరాజు తెలిపిన వివరాల ప్రకారం.. మధ్యాహ్న సమయంలో విద్యుదాఘాతానికి నివాసం ఉండే పూరి గుడిసె పూర్తిగా కాలిపోయిందని. ఈ ఘటనలో తిండి గింజలు, దుస్తులు, వంట పాత్రలు, ఇతర సామాన్లు అన్ని కాలి బూడిద అయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం తమను ఆదుకోవలని అన్నారు.