ASR: తన స్కూటీ దహనం చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని హుకుంపేట మండలం శోభకోట సచివాలయ మహిళా పోలీస్ టీ. చంద్రకళ కోరారు. ఇవాళ హుకుంపేట పోలీసులకు ఫిర్యాదు చేశారు. తన భర్త ఏ. చంద్రబాబు వేధింపులు తాళలేక తన పుట్టిల్లు బొండలమామిడిలో ఉంటున్నానన్నారు. అయినా తన భర్త ఫోన్ చేస్తూ వేధింపులకు గురిచేస్తున్నాడన్నారు. ఈక్రమంలో మరో వ్యక్తితో స్కూటీని దహనం చేశాడన్నారు.