SRCL: తంగళ్ళపల్లి మండలం జిల్లెల్లలోని కట్ట మైసమ్మ దేవాలయానికి లక్ష రూపాయలు వెచ్చించి గ్రామ యువకులు మెట్లు నిర్మించారు. ఈ సందర్భంగా యువకులు మాట్లాడుతూ.. యువకులు స్వచ్ఛందంగా కార్యక్రమాలు నిర్వహిస్తూ అందరికీ ఆదర్శంగా ఉండాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఫ్యాక్స్ ఛైర్మన్ కోడూరి భాస్కర్ గౌడ్, సర్పంచుల ఫోరం మాజీ అధ్యక్షుడు మాట్ల మధు, యువకులు పాల్గొన్నారు.