SKLM: రాజకీయ లబ్ధి కోసం మాజీ ఎమ్మెల్యే రెడ్డి శాంతి చేస్తున్న అసత్య ఆరోపణలు తగవని పాతపట్నం టీడీపీ సీనియర్ నేత సలాన మోహనరావు అన్నారు. ఈ మేరకు శనివారం స్థానిక టీడీపీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. ఆమె చేసిన విమర్శలు వాస్తవాలపై కాకుండా కేవలం ప్రచారం కోసం మాత్రమేనని మండిపడ్డారు.