NRML: కామారెడ్డి SC కార్పొరేషన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా పనిచేసిన టీ. దయానంద్, నిర్మల్ జిల్లా SC అభివృద్ధి అధికారిగా శనివారం బాధ్యతలు స్వీకరించారు. అనంతరం జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్‌ను మర్యాదపూర్వకంగా కలసి పూలమొక్కను అందజేశారు. కలెక్టర్ ఆయనకు శుభాకాంక్షలు తెలియజేస్తూ, SC అభివృద్ధి పథకాలను సమర్థవంతంగా అమలు చేయాలని సూచించారు