ADB: వంజారి సంఘ అభివృద్ధికి తన వంతుగా కృషి చేస్తానని కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ అసెంబ్లీ ఇంచార్జ్ అడే గజేందర్ పేర్కొన్నారు. బోథ్ మండల కేంద్రానికి చెందిన వంజారి సంఘ సభ్యులు శనివారం కలిసి కమ్యూనిటీ హాల్, త్రాగునీరు ఏర్పాటు చేయాలని కోరుతూ వినతి పత్రాన్ని అందజేశారు. సమస్యలను త్వరలోనే పరిష్కరిస్తానని హామీ ఇచ్చినట్లు సంఘం అధ్యక్షుడు శ్రీనివాస్ తెలిపారు.